Thursday, February 12, 2009

chiru in telugu film industry

చలనచిత్ర ప్రస్థానం

చెన్నై లోని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుండి డిప్లొమా పొందిన తర్వాత 1978 లో పునాది రాళ్లు సినిమా చిరంజీవి నటించిన మొదటి సినిమా. కాని ప్రాణం ఖరీదు ముందుగా విడుదల అయ్యింది. మొదటిసారి నిర్మాత జయకృష్ణ ద్వారా చిరంజీవికి ముట్టిన పారితోషకం 1,116 రూపాయలు. మనవూరి పాండవులు, మోసగాడు, రాణీ కాసుల రంగమ్మ, ఇది కధ కాదు వంటి సినిమాలలో చిన్న పాత్రలు, విలన్ పాత్రలు పోషించాడు.


ఎ.కోదండరామి రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఖైదీ సినిమాతో చిరంజీవి హీరోగా నిలద్రొక్కుకున్నాడు. ఇంకా రుద్రవీణ, చంటబ్బాయ్,ఛాలెంజ్, శుభలేఖ చిత్రాలలో వివిధ తరహా పాత్రలలో మెప్పించి మంచి గుర్తింపు పొందాడు. గాంగ్ లీడర్ సినిమా చిరంజీవికి బలఙయన మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టింది. 1980, 90లలో రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు వంటి వినోదాత్మక చిత్రాలు, ఆపద్బాంధవుడు, స్వయంకృషి వంటి సున్నితమైన పాత్రలతో వచ్చిన సినిమాలు కూడా విజయవంతమయ్యాయి. తరువాత కొంతకాలం చిరంజీవి సినిమాలు అంతగా విజయవంతంగా నడువ లేదు.

2007-2008 సంవత్సరాలలో చిరంజీవి రాజకీయాలలోకి రావాలని రాష్ట్రమంతటా ప్రదర్శనలు జరిగాయి. పోస్టర్లు వెలిశాయి.

మళ్ళీ 1990 దశకం చివరిలో వచ్చిన జగదేక వీరుడు అతిలోక సుందరి, హిట్లర్, చూడాలని వుంది సినిమాలు మంచి విజయాలను సాధించాయి. 2002లో వచ్చిన ఇంద్ర,ఠాగూర్ సినిమాలు తారా పధంలో చిరంజీవిని అత్యుత్తమ స్థానానికి తీసుకు వెళ్ళింది. ఇదే సమయంలో చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశంపై ఊహాగానాలు విస్తృతంగా చర్చనీయాంశాలయ్యాయి. తరువాత వచ్చిన శంకర్ దాదా ఎమ్.బి.బి.ఎస్, స్టాలిన్ వంటి సినిమాలు విజయవంతాలైనా గాని సినిమా బడ్జెట్‌లు విపరీతంగా పెరిగి పోవడం వలనా, ప్రేక్షకుల అంచనాలు అతిగా ఉండడం వలనా, రంగంలో తీవ్రమైన పోటీ నెలకొనడం వలనా అంత పెద్ద హిట్‌లుగా పరిగణించబడడం లేదు.

తెలుగు సినిమా రంగంలో చిరంజీవిని మొదటి యాక్షన్-డాన్స్ మాస్ హీరోగా చెప్పుకోవచ్చును. అంతకు ముందు హీరోల సినిమాలలో ఈ అంశాలున్నా వాటికి అంత ప్రాముఖ్యత ఉండేది కాదు. ఇంకా ఈ ఇమెజ్ వలన చిరంజీవి సున్నితమైన పాత్రలు పోషించిన సినిమాలకు తగినంత ప్రాధాన్యత రాలేదనిపిస్తుంది.

No comments: